24.2.09

వై.ఎస్.వ్యూహం ఫలించేనా?

ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తన రాజనీతిజ్ఞత కాంగ్రెస్ అధిస్థాన వర్గాన్ని దారికి రప్పించుకోవడంతో సఫలీక్రుతలయ్యారు. ప్రత్యేక తెలంగాణా పై అసెంబ్లిలొ అతిత్వరలో తీర్మానం చేయవలసిన ఆవశ్యకత లేదనే తన బలమైన వాదనతో అధిస్థాన వర్గాన్ని అంగీకరింపచేసారు.ఈ తీర్మానం వల్ల కాంగ్రెస్ కు కలిగే నష్టం కేంద్ర కాంగ్రెస్ నాయకులకు స్పష్టంగా అర్ధమయ్యేటట్టు వివరించడంలొ విజయం సాధించారు.పార్టీ ప్రయోజనాల రీత్యా తెలంగాణా అంశాన్నివాయిదా వేయడమే శ్రేయస్కరమని కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకునేలా చేసారు.ఢిల్లీ లో చక్రం తిప్పి కాంగ్రెస్ లో తన ఆధిక్యాన్ని,రాజనీతి పరిణితిని నిరూపించుకున్నారు.

ఇంతకీ తెలంగాణా విషయంలో అధిస్థాన వర్గాన్ని తన దారికి రప్పించుకోవడంలో వై.ఎస్.చూపిన చాతుర్యం ఎటువంటిది?తెలంగాణాపై తీర్మానం చేయకుండా ఉండడానికి ఆయన వేసిన మంత్రం మేమిటి? అనే అంశాలు పరిశీలించదగినవి.ఇప్పుడు తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేస్తే అది తమ విజయంగా టీ.ఆర్.ఎస్. గొప్పచెప్పుకునే అవకాశం ఉందని వై.ఎస్. చేసిన వాదన అధిష్టాన వర్గం మనస్సులో గట్టిగా నాటుకుంది.తొందరపడకుండా ముందర కాళ్ళకి బంధం వేసింది.తన ఘనతను మరొకరు సొమ్ము(ఓటు)చేసుకుంటారంటే ఏపార్టీ అంగీకరిస్తుంది.అందుకే ఢిల్లీవారు ఈవిషయంలో వెనకడుగు వేసింది.అదీకాక ప్రస్తుత రాష్ట్ర పరిస్థుతుల ద్రుష్ట్యా కాంగ్రెస్ అధిష్టాన వర్గం అంగీకరించింది.ఆంధ్రా,రాయలసీమ ప్రాంతాలలో చాలా చోట్ల ముక్కోనపు పోటీ జరిగే పరిస్థుతులు అధికంగా ఉన్నాయి.అటువంటి చోట్ల కాంగ్రెస్ వ్యతిరేకత ఓట్లు చీలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అభిప్రాయంతో అధిస్థానం ఏకీభవించినట్లుగా ఉన్నది. తెలంగాణా ప్రాంతంలొ బహుముఖ పోటీలు జరగవచ్చని,అవి తమకు అనుకూలిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే టి.ఆర్.ఎస్.కు,టి.డి.పి.తో గాని,ప్రజారాజ్యం తో గాని పొత్తు కుదిరితే అక్కడ కూడా ముక్కోణపు పోటీలే జరుగుతాయి.ఈ పరిస్థితి కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతుందని వై.ఎస్. అంచనా.ఈ వ్యూహం తమ పార్టీకి మేలుచేస్తుందనే నమ్మకంతో అధిస్థాన వర్గం కూడా తెలగాణా అంశం పై తీర్మానాన్ని వాయిదావేయాలని నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడం సమంజసమనే భావాన్ని వై.ఎస్. అధిస్థానవర్గంలో కలగచేసారు.

అంతేకాక ఒంటరి పోరాటమే కాంగ్రెస్ కు లాభసాటిగా ఉంటుందనే వై.ఎస్. ఆలోచన సమంజసంగా కనబడుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో టి.ఆర్.ఎస్. గొంతెమ్మ కోర్కెలు తెలుగుదేశానికి మింగిడు పడటంలేదు. టి.ఆర్.ఎస్.కు కోరిన ప్రకారం సీట్లను కేటాయిస్తే తెలుగుదేశానికి తెలంగాణాలో సగం స్థానాలు కూడా మిగలవు.టి.ఆర్.ఎస్.కు కేటాయించే సీట్లలో తెలుగుదేశం శాశ్వతంగా పట్టు కోల్పోయే ప్రమదం ఉంది.ఒకవేళ పొట్టు పెత్తుకోకపోతే కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టం కావచ్చు.తెలుగుదేశం చొరవచేయకపోతే ఆవకాశాన్ని ప్రజారాజ్యం తన్నుకుపోయే అవకాశం ఉంది.టి.ఆర్.ఎస్.కు అధిక సీట్లు కేటాయిస్తే ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న వామపక్షాలు ఆగ్రహించవచ్చు.అంటే కరవమంటే కోపం,విడవమంటే పాముకు కోపం.ఇదీ తెలుగుదేశం పార్టీ దుస్థితి.

తెలుగుదేశం పార్టీ సంకటస్థితిని ఆధారం చేసుకుని లబ్ధి పొందడానికి ప్రజారాజ్యం ప్రయత్నిస్తోంది. టి.ఆర్.ఎస్.కి పది లోక్ సభ,60 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి ప్రజారాజ్యం సంసిధ్ధత వ్యక్తం చేసింది. టి.ఆర్.ఎస్.కోరిక నెరవేర్చడంలో టి.ది.పి.కి ఉన్నన్ని అడ్డంకులు ప్రజారాజ్యంకి లేవు. టి.ది.పి. ఇప్పటికే వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్నది.అటు వామపక్షాలు,ఇటు టి.ఆర్.ఎస్.కు సీట్లు కేటాయిస్తే తమకు సగం కూదా మిగలవన్న భయం టి.ది.పి.కి ఉంది.కాగా ప్రజారాజ్యం కేవలం టి.ఆర్.ఎస్.ను సంత్రుప్తి పరుస్తే చాలు.టి.ఆర్.ఎస్.కు అధిక సీట్లు కేటాయిస్తే తెలంగాణాలొ తాము బలహీనపడతామన్న భయం టి.ది.పి.కి ఉంది.కాని ప్రజారాజ్యంకి ఇంకా అక్కడ క్యాడరు లేదు. కనుక బలహీనపడతం అన్న ప్రశ్నే లేదు. ఈ పరిస్థితులలొ టి.డి.పి.పార్టీ తీసుకునే నిర్ణయం ప్రజారాజ్యం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది.

ప్రతిపక్ష శిబిరంలో సీట్ల సర్దుబాటులొ నెలకొనివున్న గందరగోళం కాంగ్రెస్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. టి.ఆర్.ఎస్.తో పొత్తుకుదుర్చుకునే పార్టీలు పరోక్షంగాను, కుదుర్చుకోని పార్టీలు ప్రత్యక్షంగాను దెబ్బతింటాయి. కాంగ్రెస్ కోరుకునేది అదే.టి.ఆర్.ఎస్.ను దూరంగా ఉంచడంవల్ల కాంగ్రెస్ కు ఎటువంటి సమస్య ఉండదు.రాష్ట్రంలొ అన్నిప్రాంతాలలో ఒంటరిగానే పోరాటం చేయగల అర్ధబలం, అంగబలం తమకు ఉన్నాయని కాంగ్రెస్ నమ్ముతున్నది. తాము ప్రవేశపెట్టిన పధకాలు,చేపడుతున్న పధకాలు తమకు గెలిపించగలవన్న ఆశ కూడా కాంగ్రెస్ కు ఉంది. అంతేకాక తమ వ్యూహం సరైనదేనన్న నమ్మకాన్ని కూడా ఆయన అధిస్టానంలో కలిగించారు.

ఇంతకీ కాంగ్రెస్ ఒంటరి పోరాటం విషయంలొ కాంగ్రెస్స్ వ్యూహం ఫలిస్తుందో,తెలంగాణా వాదం గెలిపిస్తుందో అనే విషయం తేలాలంతే వేచి చూడవసిందే.

ఎం.వి.రమేష్.

No comments: