19.2.09

ఆంధ్ర రాజకీయాల సింహావలోకనం


సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమౌతున్నది.ఎన్నికల కమీషనర్లలో ఒకరయిన శ్రీ ఖురెషి లండన్ లో చేసిన వ్యాఖ్య రాజకీయ పార్టీలకు ఎన్నికల సంకేతాలను ఇచ్చాయి.లొక్ సభ ఎన్నికలు ఏప్రిల్ ఎనిమిది నుంచి మే 15వ తేదీ మధ్య ఉండవచ్చు అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత కలకలం స్రుష్టించినప్పటికీ షెడ్యులు ప్రకారం అటూ ఇటూ గా ఆ సమయములోనే ఎన్నికలు జరగవలసి ఉన్నది.


వంద రోజులలో ఎన్నికలు అంటూ ఇప్పటికే రాజకీయ పార్తీలు కౌంట్ డౌన్ ప్రారంభించాయి. వాస్తవానికి ఆంధ్రప్రధేశ్ లో ఆరు నెలల క్రితమే ఎన్నికల సందడి ప్రారంభం అయింది.

సినీరంగంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయలలో కలకలం స్రుష్టించింది.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక వర్గం,తెలుగుదేశం పార్టీలో మరొక సామాజిక వర్గం పెత్తనం చెలాయిస్తున్నప్పటికీ బయటకు గట్టిగా అనుకునే పరిస్ఠితి లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన మరొక సామాజిక వర్గం ప్రధాన రాజకీయ పార్టీలు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదనే అసంత్రుప్తిలో ఉండేది. ఇదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతొ ఈ వర్గానికి కొత్త శక్తి వచ్చినట్లు అయింది.

ఎప్పుడు అయితే చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించారో అప్పటి నుంచే రాష్ట్రంలొ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పవచ్చు.ఎన్ని కొత్త పార్తీలు వచ్చినా తమ ఓటు బ్యాంక్ కు వచ్చే నష్టం ఏమి లేదనే కాంగ్రెస్,తెలుగదేశం పార్టీలు ఎంతగా బింకాలు పలికినా ప్రజారాజ్యం పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండగలదని బేరీజు వేయడం ప్రారంభించాయి.దీనికి తోడు ప్రజారాజ్యం తిరుపతి సభ విజయవంతం కావడం రెండు పార్టీలకు కంగారు పుట్టించింది.దీనితో తమ సత్తా నిరోపించుకొవడానికి పోటాపోటీగా రోడ్ షొ లు ప్రారంభించాయి.దీనితో ఆరు నెలల ముందే ఎన్నికల 'కళ ' వచ్చినట్లు అయింది.

//ఎత్తులకు పై ఎత్తులు//


అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీని గద్దె దింపాలని విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు ప్రారంభించాయి.తాము చేపట్టిన అభివ్రుధి సంక్షేమ పధకాలే తమకు శ్రీరామరక్ష అని,తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తెలుగుదెసం పార్తీ అథ్యక్షుడు చంద్రబాబునాయుదు నెమ్మదిగా పావులు కదపటం ప్రారంభించారు.కేంద్రంలొ కాంగ్రెస్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసిం హరించినప్పటి నుంచి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.తెలుగుదేశం పార్టీ వైపు సి.పి.ఎం. మొదటి నుంచి మొగ్గు చూపగా,సి.పి.ఐ.కొంతకాలం ప్రజారాజ్యం పార్టీ వైపు చూపులు సారించినా చివరికి బాబు ప్రతిపాదనలకు అంగీకరించి మహాకూటమి వైపు అడుగులు వేసింది.ప్రత్యేక తెలంగాణకు జై కొట్టడ్డాం ద్వారా నెమ్మదిగా తెలంగాణా రాష్త్ర సమితిని తమ కూటమిలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.ఎట్టకేలకు 2004లో రాజశెఖర్ రెడ్డి కి మాదిరిగా విపక్షాలను ఒకత్రాటిపైకి తీసుకుని రావడంలొ చంద్రబాబు సఫలీక్రుతులు అయ్యారు.మహాకూటమి ఆవిర్భవించింది.ప్రత్యేక తెలంగాణా ధ్యేయంగా సినీనటి విజయశాంతి ఆధ్వర్యంలొ ఏర్పడిన తల్లి తెలంగాణ పార్టీ తెలంగణా రాష్త్ర సమితిలో విలీనం అయ్యింది.

తెలంగాణా వాదులలొ నవ తెలంగాణ పార్టీని స్థాపించిన దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణాకు సై అన్న చిరంజీవి పార్టీతొ రాజకీయ అవగాహనకు వచ్చారు. అభివ్రుధి మంత్రంతో కాంగ్రెస్ పార్టీ ఎవరూ పొత్తుకు ముందుకు ర్రకపోవడంతొ భారతీయ జనతా పార్తీ ఒంటరిగా పోటీ చేయబోతున్నాయి.

// రోడ్ షో లకు పెరిగిన ఆదరణ //

ఎన్నికల ప్రచారంలొ రోడ్ షో లకు ఆదరణ పెరిగింది.ఎన్.టి.ఆర్. రాజకీయలలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారములలొ మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.అంతకు ముందు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు,ఇంటింటికి ప్రచారం,అభ్యర్ధులకు మద్దత్తుగా ర్యాలీలు ఉండేవి. ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రచార ధోరణిలొ మార్పు వచ్చింది.ఒక్కసారిగా సినీరంగం నుంచి వచ్చిన ఎన్.టి.ఆర్.తమ పార్టీని ప్రజలలోనికి తీసుకురావడానికి ఊరూరా తిరిగారు.రాత్రనక పగలనక శ్రమించేవారు. ఆనాటి ఎన్.టి.ఆర్. ప్రచార రధమే నేటి రాజకీయపార్టీల రోడ్ షోలుగా చెప్పవచ్చు.రోడ్ షోలవల్ల వ్యయప్రయాసలు తక్కువ హంగూ,ఆర్భాటాలు అవసరము ఉండదు.జనసమీకరణ ప్రశ్నే ఉండదు.అందుకే అన్ని రాజకీయ పార్టీలు రోడ్ షో లకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు.

// ప్రచారంలొ వింత ధోరణులు //

ఈసారి ఎన్నికల ప్రచారంలొ వింత ధొరణులు కనిపిస్తున్నయి.సినీనటుడైన చిరంజీవిని ఎదుర్కోనెందుకు కాంగ్రెస్,తెలుగుదేసం పార్తీలు సినీనటులను రంగంలోకి దింపాయి.ఇంతకు ముందెన్నదూ లేనంతగా సినీనటులు ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరు తొడకొట్టి,మరొకరు చొక్కావిప్పి సవ్వల్చేస్తుంతే,ఇంకొకరు మీసం మెలివేసి చాలెంజ్ చేస్తున్నరు.సినీనటులకు తామేమి తీసిపోమంటూ ముఖ్య్యమంత్రి గాలిలోకి ముద్దులు ఇస్తూ ప్రజలను మురిపిస్తున్నారు. ఓటర్లు రాబోయే ఎన్నికలలో తొడగొట్టిన చిరంజీవిని గెలిపిస్తారో,మీసం మెలివేసి మరీ తెలుగుదేసం పార్టీని గట్టెకిస్తానన్న బాలయ్య ప్రతిజ్ఞ్న నెరవేరుస్తారో,ముఖ్యమంత్రి ప్రేమతో గాలిలోకి ఇచ్చిన ముద్దులకు మురిసిపోయి తిరిగి కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెడుతారో చూడాలి మరి!

/ వి.ఉషారాణి. /

No comments: