ఫలించని సినీగ్లామర్
సినీనటులు ఎన్నికలలో పోటీచేసి తీరుతారనే నమ్మకం గతంలో రాజకీయపార్టీలకు ఉండేది. గతంలో కొందరు సినీనటులకు టికెట్లు ఇచ్చి,మరికొందరు నటులతో ప్రచారం చేయించి రాజకీయపార్టీలు లబ్ది పొందిన సందర్భాలు అనేకం. కానీ ఈసారి ఎన్నికలలో సినీనటులచేత భారీగా ప్రచారం చేయించిన తెలుగుదేశం,ప్రజారాజ్యం పార్టీలు బోల్తాపడ్డాయి. పోటీచేసిన సినీనటులు దాదాపు రెండు దశాబ్దాలపాటు ఏకచత్రాధిపత్యంగా సినీరంగాన్ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యం అలనాడు తెలుగుదేశం పార్టీ వలే విజయఢంకా మోగిస్తుందని భావించిన వారికి ఆశాభంగమే మిగిలింది. ఆపార్టీకి అంచనాల కంటే చాలా తక్కువ ఓట్లు రావడం విడ్డూరమే. చిరంజీవి,పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షోలకు,సభలకు విపరీతంగా జనం హాజరయ్యారని,తమ పార్టీ విజయం తధ్యమని ప్రజారాజ్యం పార్టీ కన్నకలలు కల్లలయ్యాయి.సభలకు వచ్చిన వారంతా ఓటు చేస్తారనుకోవడం వట్టిభ్రమేనని మరొకసారి రుజువయ్యింది. వివిధపార్టీల తరఫున పోటీచేసిన సినీ ప్రముఖలలో కొందరు విజయంసాధించడం,మరికొందరు పరాజయం పాలుకావడం ప్రజలు గుడ్డిగా ఓట్లు వేయలేదనడానికి నిదర్సనం.
తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖనటుడు మురలీమొహన్,ప్రజారాజ్యం పార్టీకి చెందిన రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి ఒక సామాన్య ఎం.పి.ఉండవల్లి అరునకుమార్ చేతిలో పరాజయం పాలుకావటం సినీగ్లామర్ను ప్రజలు లక్ష్య పెట్టలేదనటానికి సంకేతం.జూనియర్ ఎన్.టి.ఆర్, కల్యాన్ రాం,తారక రత్న చేసిన ఆసక్తి కర ప్రసంగాలు తెలుగుదేశం పార్టీకి కలిసి రాలేదు.మొత్తం మీద ప్రజల విజ్ఞత ముందు సినీగ్లామర్ ఓడిపోయిందని చెప్పకతప్పదు.
నిష్ఫలమైన నినాదాలునినాదాలతో గద్దెనెక్కవచ్చునని ఆశించిన వారికి ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. చిరంజీవి ప్రచారం చేసిన 'సామాజిక న్యాయం'నినాదం ఆపార్టీని గట్టెకించక లేకపోయాయి. అవి పసలేని నినాదాలుకావడం లేదా వాటిని ప్రజల మనస్సుకు హత్తుకునేలా చేయడంలో పి.ఆర్.పి. విఫలంకావడం దీనికి కారణం కావచ్చు.ఈవిషయంలో ప్రజారాజ్య పార్టీ ఆత్మ పరిసీలన చేసుకోవడం అవసరం. ప్రభుత్వ అవినీతిపై కొన్ని పార్టీలు చేసిన విమర్శలు,అవినీతిని నిర్మూలిస్తామని కొందరు నాయకులు చేసిన వాగ్దానాలు ఓట్లను రాల్చలేకపోయాయి.నినాదాలతోను,వా
అచ్చిరాని తెలం'గానం
ప్రత్యేక తెలంగాణా నినాదం ఈసారి పార్టీలకు అచ్చిరాలేదు.ప్రత్యేక తెలంగాణా సాధనమే ప్రధాన అజెండాగా పోటీకి దిగిన తెలంగాణా రాష్ట్ర సమితి మహకూటమిలో చేరినా చెప్పుకోదగినన్ని స్ధానాలను గెలుచుకోలేకపోయింది.ప్రత్యేక తెలంగానాకి అనుకూలంగా తెలుగుదేశం,వామప్క్షాలు,టి.ఆర్.
ప్రత్యేక తెలంగాణా పై కాంగ్రెస్స్ వఒఖరిని గమనించడం ఈసంధర్భంలో అవసరము. తెలంగాణాకు కాంగ్రెస్స్ పార్టీ వ్యతిరేకం కాదని,ప్రత్యేక రాష్ట్రం ఏరపాటు వల్ల ఏవిధమైన సమస్యలు తలేత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని,ఇందుకు సమగ్ర అధ్యయనం అవసరమని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి గతంలో ప్రకటించారు. ఈఅంశంపై అధ్యయనం జరిపించవలసిన భాధ్యత ఆయనపై ఉంది. వై.ఎస్. అన్నమాట నిలబెట్టుకుంటారా,తమ శత్రువులు ఓడిపోయారన్న ఆనందంతో ఈఅంశాన్ని బుట్టదాఖలు చేస్తారా అన్నది వేచి చూడవలసిందే. రాజకీయ ప్రయోజనాలకోసంగాక, అభివ్రుధ్ధి ప్రాతిపదికగా ప్రత్యేక తెలంగాణాపై అధ్యయనం జరిపి తగిన నిర్ణయం తీసుకోవడం సముచితం.
రాష్ట్ర కాంగ్రెస్స్ ను ఓడించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కసరత్తు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. పార్టీ అధినేత చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఏర్పాటు చేసిన మహాకూటమి విఫలమయింది.చంద్రబాబు నాయడు చేసిన నగదు బదిలీ,ఉచిత టి.వి.లు పంపిణీ పధకాలు ఓట్లను ఆకర్షించలేకపోయాయి. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞత తో ఓటు చేశారు. అవకాశ వాద రాజకీయాలకు ఈ ఎన్నికలు చెంపపెట్టు.మన ఓటర్లు వివేకాన్ని మరింత పెంచుకొంటే మనదేశంలో ప్రజాసామ్యం బలపడుతుంది.
3 comments:
bagundi
"ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞత తో ఓటు చేశారు"
అవునా?
"ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞత తో ఓటు చేశారు".
Wrong analysis. People voted according to their vote bank politics. Anti-government votes were split between Mahakootami and PRP.
Congress has 35-40% vote bank in Andhra Pradesh (Muslims 10%, Upper Caste Christians 5%, Brhmins 5%, Reddy 8%, Dalit Christians 10% etc).
So they always vote for Congress. That is how Congress (38% votes) won the elections. 62% of the voters rejected Congress.
Post a Comment