27.3.09

పరిణితిలేనీ"దేశం"పథకాలు వ్యూహాత్మకంగా ప్రజారాజ్యం మానిఫెస్టొ.

ఎన్నికల తేదీని ప్రకటించగానే మనరాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేప్రయత్నాలను ముమ్మరం చేశాయి.జనాకర్షణ కోసం సంతర్పణ పథకాలను ప్రవేశపెట్టడంలో తెలుగుదేశం పార్టీ తన అథిక్యాన్ని మరొకసారి రుజువుచేసుకొంది.ఆపార్టీ అథినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన క్యాష్ ట్రాన్స్ ఫర్ పథకం,ఇంటింటికి ఉచితంగా కలర్ టి.వి ల పథకం ముమ్మాటికీ సంతర్పణ పథకాలే.

తాము అథికారంలోకి వస్తే నిరుపేదలకు నెలకు రెండువేలరూపాయలు, పేదలకి 1500/, మథ్యతరగతికి వెయ్యి రూపాయలు చొప్పున అందచేస్తామని,ఈపథకం క్రింద ఆయాకుటుంబాల మహిళలపేరిట నేరుగా బ్యాంకులలో ప్రతినెల జమచేస్తామని,నెలజీతాలమాదిరిగా ఈసొమ్ము పేదలకు అందుతుందని ఆయన వివరించారు.ఈపథకం తెల్లరేషన్ కార్దుల వారికే ప్రత్యేకమని అంటూనే రాష్ట్రంలో బోగస్ కార్దులు అథికంగా వున్నాయని బాబుగారు పేర్కున్నారు. దీంట్లో ఉంది మెలిక అంతా: ఒక వంక తెల్లరేషన్ కార్దులవారికి ఈపథకం ప్రకటించడం, మరొక వంక బోగస్ పేరిట కార్దులను ఏరివేసి భారాన్ని తగ్గించుకోవడం. ఇదీతెలుగదేశం టెక్నిక్. గతంలో అథికారంలో ఉన్నపాడు చాలాసార్లు బోగస్ పేరిట తెలుగుదేశం పార్టీ పలురేషన్ కార్దులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈక్యాష్ ట్రాన్స్ ఫర్ పథకానికి ఏదాదికి 18వేలకోట్లు ఖర్చు అవుతుందని,అది ప్రభుత్వానికి పెద్దభారం కాదని తెలుగుదేశం పార్టీ అథినేత సెలవిచ్చారు.అంతేగాక అర్హులైన పేదలకు ఉచితంగా కలర్ టి.వి.లను పంపిణీ చేస్తామని,ఒకఫ్యాను, రెండు బల్బులు, టి.వి.కి ఉచితంగా విథ్యుత్ సరఫరా చేస్తామని బాబుగారు వాగ్దానం చేసారు.తెలుగుదేశం పార్టీకి సంతర్పణకు,సంక్షేమానికి తేడా తెలియదనే విమర్సకు సాక్షీ భూతంగా చంద్రబాబునాయుడు గారి ఈపథకాలు కనిపిస్తున్నాయి.

పేదల విషయంలో అనుసరించవలసిన వైఖరిలో తెలుగుదేశం పార్టీ మొదటినుండి తప్పటడుగు వేస్తూనే ఉంది.డబ్బును,కలర్ టి.వి.లను పంపిణీ చేయడం వల్ల పేదరికం అంతరించదు.ఉత్పత్తిని పెంచడానికి ఉపకరించిన పథకాలకు వేలాదికోట్లు గుమ్మరిస్తామనడం వివేకవంతులు చేసేపనేనా? ప్రజలకు ఉత్తిపుణ్యాన 18వేలకోట్లు థారపోయడంవల్ల ప్రభుత్వానికి ఏ ఆదాయం రాదు. పైగా పేదలు శాశ్వతంగా పేదరికంలోనే మగ్గిపోయేటట్టు ఈ పథకం చేస్తుంది. ఇలా ప్రజాథనాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేయడంకంటే ఏ పారిశ్రమిక రంగంలోనో, వ్యవసాయరంగంలోనో పెట్టుబడిగా వినియోగిస్తే ప్రజలకు ఉపాథి, ఆదాయం లభించడంతో పాటు రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివ్రుథి చెంద గలదు.పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి అవకాశం లభిస్తుంది.

పేరు పెట్టని ఈ పథకం ప్రస్తుతం అమలులో ఉన్న వితంతువులు,వ్రుథులు, వికలాంగుల పెన్షన్ పథకాలకు అదనమని కూడా ఘనత వహించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నరు. ఊరు పేరూ లేని ఈ కొత్తపథకం కన్నా ఆపెన్షన్ పథకాలు ఎంతో శ్రేస్థమైనవి.ఎందుకంటే వ్రుథులు,వికలాంగులలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు.మనబాబుగారు కొత్త పథకానికి ఖర్చుపెట్టదలచుకొన్న 18వేలకోట్ల రూపాయలను వికలాగులు,వితంతువులు,రిటైర్డ్ ఉద్యోగులలో ఉన్న ప్రతిభను సామర్థ్యాన్ని వెలికితేయడానికి వినియోగిస్తే దేశం ఎంతో అభివ్రుథి సాథించగలదు. నిస్సహాయులైన వారికి దారి చూపించడంతో పాటు దేశప్రగతికి బాట వేసేమార్గాలను అన్వేషించడం ఉత్తమం. వికలాగులు,వ్రుథులు,వితంతువులలో ప్రతిభ లేని నిస్సహాయులు,నిరాశ్రయులు కూడా ఉండవచ్చు.అటువంటివారిని ఆదుకోవడం కూడా ప్రభుత్వ భాథ్యతే. అదే అసలైన సంక్షేమం.సుమారు 30సంవత్సరాలు పార్లమెంట్ మెంబరుగా,9సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజకీయ అనుభవం గడించిన చంద్రబాబునాయుడు ప్రజలకు ఏది క్షేమకరమో తెలుసుకోలేని దుస్థితిలో ఉండటం శోచనీయం.కేవలం జనాకర్షక పథకాలు ప్రజల కస్ట్టాలను గట్టెక్కించలేవని ఈమాజీ ముఖ్యమంత్రిగారు గ్రహించడం మంచిది.

ప్రజాకార్యక పథకాలను ప్రకటించడంలో ప్రజారాజ్యం పార్టీ అథినేత చిరంజీవి ఏమాత్రం వెనుకబడలేదు.చిరంజీవికి రాజకీయం ఏంతెలుసు అని విమర్శించిన వారికి ఆయన ప్రకటించిన ఎన్నికల మానిఫిస్తో కనిపిస్తోంది.తెలుగుదేశం,ప్రజారాజ్యం ఒకేతానులో ముక్కలని నిరూపించేవిథముగా ఈ మానిఫిస్తో రూపొందించింది.100రూపాయలకే నెలసరి సరుకులు పంపిణీ,చీరలు,థోవతుల పంపిణీ,స్వయం సహాయసంఘాలకు ఆరోగ్య జీవితభీమాపథకాల ఏర్పాటు, పేదలకుటుంబాలకు రెండున్నర ఎకరాల మాగాణి లేదా 5ఎకరాల మెట్ట పంపిణీవంటి పథకాలు ఓటర్లను ఆకర్షించడానికేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.తెలుగుదేశపార్టీ వ్యవస్తాపకుడు యన్.టి.రామారావు, ప్రజారాజ్యం అథినేత చిరంజావి ఒకే బడిలో చదువుకున్నరనడానికి(ఒకే రంగంలో నుండి వచ్చిన వారనడానికి) ఇదే సాక్ష్యం.

కాని ప్రజారాజ్యం పార్టీ పథకాలలో ఎక్కువ ఆలోచన,నిజాయితీ కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ కేవలం ఆవేసంతో కొత్త పథకలు ప్రకటించింది.కాని ప్రజారాజ్యంపార్టీ ఎంతోగానో ఆలోచించి,శ్రమించి మానిఫిస్తోను రూపొందించింది. ఈపార్టీ ప్రకటించిన ఆడబిడ్డలకు పసుపు,కుంకుమ పథకలో ఓటర్లను ఆకర్షించే ఉద్దేశం ఉన్నప్పటికి కాస్తముందు చూపుకూడా లేకపోలేదు.ఆడపిల్లల భవిష్యత్తుకు ఉపకరించే ఇటువంటి పథకానికి ప్రోత్సహించవలసిందే.ఆడపిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న చులకన భావాన్ని, సమాజంలో స్త్రీలపై ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ఈపథకం తోడ్పతుంది. స్త్రీ సంతానంవద్దని ఇంతకాలం నుండి వద్దనుకుంటున్నవారు ఇకపై ఆడపిల్లలే కావాలని కోరుకోవడానికి ఈపథకం దోహదం చేయవచ్చు.అయితే ఈపథకానికి కొన్ని పరిమితులు అవసరము. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈపథకం అమలు చేయాలి.లేకపోతే రాష్ట్రంలో జనాభా అవథులులేకుండా పెరిగిపోయే ప్రమాదంవుంది.

నిరుద్యోగులకు భ్రుతి కల్పించాలని కొందరు మేథావులు చాలాకాలం నుండి చేస్తున్న సూచనను ప్రజారాజ్యం తన మానిఫిస్తోలో చేర్చడం ముదావహం.నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో ఎదురయ్యే సమస్యలను గమనించిన వారికి దీని ఆవశ్యకత అర్థం కాగలదు.అయితే వయస్సు,విద్యార్హతలు తప్పనిసరి. కామన్ ఎంట్రన్స్కు పరీక్షకు ప్రవేశరుసుము తొలగించాలన్న ఆలోచన మథ్యతరగతి వారికి ఊరటనిస్తుంది.ప్రజారాజ్యం ప్రకటించినట్టుగా ఎస్సి,ఎస్టి,బిసి కాలనీలకి,చేనేత కార్మికులకు,కుటీర పరిశ్రమలకు ఉచితవిద్యుత్ ను ఇవ్వడం ఎంతవరకు సాథ్యమో ఆలోచించాలి.ఆయావర్గాల వారు అభివ్రుథి చెంది రాష్ట్రాభివ్రుథికి తోడ్పడే వరకు అమలుచేయాలి.ప్రభుత్వానికి భారం కలిగించే స్టాయికి ఈపథకాలు చేరుకుంటే ప్రజలకు పన్నులు,అథికధరల భారం తప్పదు.

మథ్యపానాన్ని నియంత్రిస్తూ క్రమక్రంగా మథ్యనిషేథాన్ని ప్రవేశపెట్టేదిశగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన సమర్థనీయం. గతంలో తెలుగుదేశంపార్టీ ప్రవేశపెట్టిన మథ్యనిషేథం చిత్తశుథ్థిలోపంవల్ల విఫలమయింది.అథికారుల,అనథికారుల అవినీతి మూలంగా ఈపథకం నీరుగారిపోయింది.ప్రజారాజ్యంపార్టీ ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటే ప్రజల ఆరోగ్యంతో పాటు పేదప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి.

మొత్తం మీద 27సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆలోచనల కంటే ఇటీవల ఆవిర్భవించిన ప్రజారాజ్యంపార్టీ వ్యూహం మెరుగుగా ఉండటం గమనార్హం.పథకాల ప్రకటనలలో తెలుగుదేశంపార్టీ నాయకులసీనియారిటీ ఎమైనట్టు? మానిఫిస్తోలో ప్రకటించిన అంశాలపై చిత్తశుథ్థిని ప్రదర్సించగలిగితేనే ప్రజారాజ్యం పార్టీ ప్రజాభిమనాన్ని పొందగలదు.

ఎం.వి.రమేష్

No comments: