27.3.09

ఆది ఆరంగేట్రం అదుర్స్

ఆది 'ఆరంగేట్రం అదుర్స్

మహాకూటమి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జూనియర్ ఎన్.టి.రామారావు కోస్తా ప్రజలను ఉర్రూతలూగిస్తున్నరు.తెలుగుదేశంపార్టీ వ్యవస్తాపకుదు నందమూరి తారక రామారావు పేరుతో పాటు పోలికలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్.కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల వేళ అందునా సినీనటుల సభలకు ప్రజలు రావడం సహజమే అయినప్పటికి జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ స్ఠాపించినప్పుడు ఎన్.టి.రామారావు చేసిన ప్రచారం తీరుగానే ఆయన మనమడు సాగుతున్నారు. తాను తాతగారిని అనుకరించడంలేదని జూనియర్ ఎన్.టి.ఆర్.చెబుతున్నా కాకిరంగు ప్యాంట్,అదే రంగు చొక్కా,మెడలో పసుపుపచ్చ రంగు కండువాతో ఆనాటి ఎన్.టి.ఆర్.ను గుర్తుకుతెస్తున్నారు.తాతగారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం నొంచే జూనియర్ రోడ్ షోను ప్రారంభించారు.

ఆపద్భాంథవులు నందమూరి హీరోలు

అథికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు బంధువులు ఎవ్వరిని దరికి చేరనివ్వని తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో నందమూరి హీరోలను రంగంలోకి దింపక తప్పలేదు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి భాగస్వామ్య పార్టీలతో సర్దుబటు,అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం భాథ్యతను నందమూరి హీరోలకు అప్పగించారు.ఇప్పటికీ చంద్రబాబు వియ్యంకుడు,హీరో అయిన బాలక్రిష్ణ రాయలసీమ,ప్రకాశం జిల్లాలలో పర్యటించగా,జూనియర్ ఎన్.టీఅర్.ఉత్తరాంథ్రాలో రోడ్ షో ప్రారంభించి కోస్తాంథ్రాలో ప్రచారం చేస్తున్నారు.బాలక్రిష్ణ రాజకీయ ప్రసంగాలు చేసి ఉండకపోవచ్చుగానీ,ప్రచారంలో పాల్గొన్న అనుభవం ఉన్నది.కాని జూనియర్ ఎన్.టి.ఆర్.కు రాజకీయాలు కొత్త, రాజకీయ ప్రసంగాలూ అంతకంటే కొత్త. ఎన్.టి.ఆర్ పోలికలను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రజాదరణ ఉండగలదన్న చంద్రబాబు వ్యూహం తప్పుకాలేదు.దీనికితోడు జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ప్రసంగం సరాంశం ఒక్కటే అయినప్పటికీ వైవిథ్యభరితంగా సాగుతన్న జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రసంగాలకు ప్రజలు హర్షథ్యానాలు చేస్తున్నారు. మాటలో స్పష్టత,తొందరపాటు,తొట్రుపాటు లేకుండా సాగుతున్న జూనియర్ ప్రసంగాలకు పార్టీ శ్రేణులే నివ్వెరపోతున్నయి.

తెలుగువారి ఆత్మగౌరవం,ఢిల్లీలో తెలుగు జాతి తాకట్టు, అక్కలారా,అన్నలారావంటి పద ప్రయోగాలు అలనాటి ఎన్.టి ఆర్ ను తలపిస్తున్నయి.127 సంవత్సరాల ముసలి కాంగ్రెస్ కావాలో,27 సంవత్సరాల నవ యవ్వన తెలుగుదేశం పార్టీ కావాలో తేల్చుకోవలసిందిగా జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రజలను కోరుతున్నారు.పదప్రయొగాలు,దానికి తగ్గ హావభావాలతో ఆయన ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు.

అంచనాల కంటే అనుమానాలే ఎక్కువ

వాస్తవానికి జూనియర్ ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రచారం ఆరంగేట్రం చేస్తారన్నప్పుడు అంచానాల కంటె అనుమానాలే ఎక్కువ.ఎందుకంతే ఎన్.టి.ఆర్ మినహా సినీరంగం నుంచి వచ్చిన నటులెవ్వరికి అంత వాగ్థాటి లేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంచేస్తున్న బాలక్రిష్ణ ఊపన్యాసాలలో అంతగా పసలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరంజీవి రాజకీయ ఉపన్యాసాలు పదునుగా లేవని,ఏదో బతిమాలుతున్న ధొరణిలో,మొహమాటంగా ఉంటున్నాయనే విమర్సలు వినిపిస్తున్నాయి. ఇంద్ర,ఠాగూర్ వంటి చిత్రాలతో పోలిస్తే చిరంజీవి రాజకీయ ప్రసంగాలు చప్పగా ఉన్నాయంటూ అభిమానులు నిరాశ చెందారు.

ఇక బాలక్రిష్ణ విషయానికి వస్తే రాసిచ్చిన్న ప్రసంగాలను కూడా సరిగ్గా చదవలేకపోతున్నారని, తడబడుతూ మాటలు వెతుక్కుంటున్నట్లుగా ప్రసంగాలు సాగుతున్నాయనే విమర్సలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రచారానికి వస్తున్నరంటే ఎన్.టి.ఆర్ మనుమడు,అందరికి తెలిసిన "ఆది",స్టూడెంట్ నెంబర్ -1 ను కనులారా చూడవచ్చని భావించారు.అయితే,అందరి అంచనాలను తలక్రిందులుగా చేస్తూ జూనియర్ ఎన్.టి.ఆర్ దూసుకుపోతున్నారు.ఒక ప్రక్క పాలక కాంగ్రెస్ ను దుయ్యబడుతూనే మరో ప్రక్క 'దేశం' పార్టీ పథకాలను ప్రచారం చేస్తున్నారు.ముసలి కాంగ్రెస్ కావాలో,నవ యవ్వన తెలుగుదేశం కావాలో జూనియర్ హాహభావాలతో చేస్తున్న ప్రసంగాలకి ప్రజలు కేరింతాలు కొడుతున్నారు.తమ పార్టీ చెప్పదలచిన పథకాలను సవివరంగా చెబుతూ పేదలకు అండగా నిలిచేది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయేనని ఆయన ప్రజలకు వినిపిస్తున్నారు.

ముందుగా రిహార్సల్

జూనియర్ ఎన్.టి.ఆర్ రోడ్ షో లు విజయవంతం కావడం వెనుక ఎంతో హోం వర్క్ ఉన్నట్లు తెలుస్తున్నది.ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జూనియర్ ఎన్.టి.ఆర్ ఎంతో 'సాథన 'చేశారని ఒక దిన పత్రికలో వార్తాకథనం. జూనియర్ ఎన్.టి.ఆర్ స్వశక్తితో పైకి వచ్చున వ్యక్తి.నిజజీవితంలోకానీ,సినీ జీవితంలోకానీ ఏటికిఎదురీది ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇంతటి స్థాయికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని, ఒరిజినాలిటిని పెంచాయని చెబుతుంటారు.

అసలు రాజకీయ ప్రసంగాలు ఎలా చేయాలి? హావభావాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై జూనియర్ ఎన్.టి.ఆర్ ఎంతో అథ్యయనం చేశారని తెలుస్తోంది.ఏఏ అంశాలను ప్రస్తావించాలి, ఎలా ప్రస్తావించాలి అనే దానిపై క్రమపథ్థతిలో విషయ సేకరణ చేసుకున్నారట.అలాగే,తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్.టి.రామారవు చేసిన ప్రసంగాల వీడియో సిడీ లను తెప్పించుకుని హావభావాలను నిశితంగా గమనించారట. ఎన్.టి.రామారావు చేపట్టిన పథకాలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మేనిఫిస్తోలో చేర్చిన అంశాలను పూర్తిగా తెలుసుకున్నారట.పాలక కాంగ్రెస్ కేంద్రంలోను,రాష్ట్రంలోను చేపట్టిన పథకాలను,అందులోని లోటుపాట్లను పలువురితో చర్చించి అవగహన పెంచుకున్నారట.

తెరవెనుక ఇంతటి శ్రమ ఉండబట్టే ఎన్.టి.ఆర్ సభలకు ఇంతటి క్రేజ్ వచ్చింది. జూనియర్ ఎంటి.ఆర్ సభలకు వస్తున్న స్పందన చంద్రబాబునాయడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ప్రచారం ఇలాగే కొనసాగించు అంటూ మేనల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు.

వి.ఉషారాణి.

No comments: